పాల్వంచ: పాల్వంచలోని నవభారత్ గాంధీనగర్ ఏరియాలో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను ఆదివారం సీపీఎం సమక్షంలో పేదలుఆక్రమించా రు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ దారా ప్రసాద్, ఎస్‌ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. ఆక్రమణలు చట్ట విరుద్ధమని అధికారులు చెప్పి ఖాళీ చేయాలన్నారు. దీంతో సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూ ఇళ్లు నిర్మించి నెలలు గడుస్తున్నా.. ఇంకా అర్హులైన పేదలకు ఇవ్వకపోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. అసంపూర్తి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసి పేదలకు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తులసీరాం, కె.సత్య, సత్యవాణి, క్రాంతి, సులోచన, మాధవి, వింజ రాములు, గౌసియా తదితరులు పాల్గొన్నారు.
మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బూర్గంపాడు: మండల కేంద్రం బూర్గంపాడుకు సమీపంలోని కిన్నెరసాని నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకుని ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ మేడా ప్రసాద్ తెలిపారు. తదుపరి చర్యల కోసం తహసీల్దార్‌కు తెలియజేశామన్నారు.


