●ప్రమాదపుటంచున ప్రయాణం.. | - | Sakshi
Sakshi News home page

●ప్రమాదపుటంచున ప్రయాణం..

Mar 30 2026 8:33 AM | Updated on Mar 30 2026 8:33 AM

పాల్వంచలోని గోవర్థనగిరి కాలనీ మూలమలుపు వద్ద సీసీ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డు దిగువ భాగం లోతుగా ఉండడంతో అటుగా వస్తున్న వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈనేపథ్యాన ఆదివారం ఓ ట్రాలీ ఆటో అదే రోడ్డులో అదుపు తప్పి పల్టీకొట్టింది. ఈ క్రమంలో అందులోని డ్రైవర్‌ చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. సరైన డ్రెయినేజీ లేకపోవడం, కాల్వ దిగువగా ఉండడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సరైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. – పాల్వంచ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement