వీఐపీల జపం.. మితిమీరిన ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

వీఐపీల జపం.. మితిమీరిన ఆంక్షలు

Mar 29 2026 7:11 AM | Updated on Mar 29 2026 7:11 AM

● ఎప్పటిలాగే సామాన్యులకు తప్పని వసతి కష్టాలు ● కలెక్టర్‌గా అంకిత్‌కు తొలి నవమి, సీఎం, గవర్నర్‌ టూర్లు సక్సెస్‌ ● ఉత్సవాల విజయవంతంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

సామాన్యుల ఇక్కట్లు

షరామామూలే

సామాన్యుల ఇక్కట్లు

షరామామూలే

ఆంక్షలతో విమర్శలు

● ఎప్పటిలాగే సామాన్యులకు తప్పని వసతి కష్టాలు ● కలెక్టర్‌గా అంకిత్‌కు తొలి నవమి, సీఎం, గవర్నర్‌ టూర్లు సక్సెస్‌ ● ఉత్సవాల విజయవంతంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, పట్టాభిషేకం విజయవంతంగా ముగిశాయి. సీఎం రేవంత్‌ రెడ్డి, గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా పర్యటనలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగియటంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రజాప్రతినిధులు, వీఐపీల సేవల్లో మునిగి తేలారని, సామాన్య భక్తుల ఇక్కట్లను పట్టించుకోలేదనే అపవాదును మాత్రం మిగుల్చుకున్నారు. మితిమీరిన ఆంక్షలతో సామాన్యులు, స్థానికులతోపాటు ప్రముఖులను కూడా ఇబ్బందులకు గురిచేశారు.

సీఎం పర్యటనపై ప్రత్యేక దృష్టి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నవమి వేడుకల్లో పాల్గొనడంతోపాటు అభివృద్ధి పనులు కూడా ప్రారంభించడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్‌గా అంకిత్‌ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి టాస్క్‌గా సీఎం పర్యటన నిలిచింది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన అధికారులను సమన్వయం చేసుకుంటూ సీఎం టూర్‌ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. వేడుకల ఏర్పాట్లు, నిర్వహణపై కూడా భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ట, ఎస్పీ రోహిత్‌ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్‌, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్‌, ఇతర అధికారులతో పలుమార్లు సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. చివరి నాలుగు రోజులు మిగతా అధికారులతో కలిసి రోజూ స్టేడియాన్ని పరిశీలించి సెక్టార్‌ వివరాలను, పనులను నిరంతరం పర్యవేక్షించారు.

సమన్వయంతో

సమష్టి విజయం..

ఉత్సవాల విజయవంతానికి ఐఏ ఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాజేడు, భద్రాచలం పర్యటన సందర్భంగా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎదుర్కోలు ఉత్సవం రోజునే వచ్చి ఏర్పాట్లను పరిశీలించి సలహాలు, సూచనలను చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు.

అధికారులు వీఐపీల పర్యటనపైనే దృష్టి సారించటంతో సామాన్య భక్తుల ఇక్కట్లు షరామామూలుగానే నిలిచాయి. ఎదుర్కోలు, నవమి వేడుకలకు అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు గదులు, డార్మెటరీలు తగినట్లు లభించలేదు. దీంతో గోదావరి ఘాట్‌ మెట్లు, కరకట్టలు, పార్క్‌లే పాన్పులుగా మారాయి. వేలాదిగా వచ్చిన భక్తులు ఎండ వేడిమికి విలవిల్లాడారు. స్టేడియంలోని గ్యాలరీలలో ఎడమ పక్కన కొద్ది మేర శాశ్వత షెడ్‌, తాత్కాలిక పందిళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీటి కోసం సైతం బతిమిలాడుకోవడం కనిపించింది. గ్యాస్‌ కొరత ఉండటంతో గతేడాది కంటే పులిహోర, అన్నదాన సేవలు తగ్గాయి. సేవా సంస్థలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో అధికారులు విఫలయ్యారనే విమర్శలు వచ్చాయి.

ఉత్సవాలు విజయవంతమైనా అధికారుల మితిమీరిన ఆంక్షలతో విమర్శలు వచ్చాయి. ఎప్పటిలాగే జ్యుడీషియరీ ప్రముఖులను గుర్తించటంతో అధికారులు విఫలమయ్యారు. గతేడాది సైతం సీఎం సెక్టార్‌లో న్యాయశాఖ వీఐపీలు నొచ్చుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ఏడాది కూడా ఖమ్మం ఫ్యామిలీ కోర్టు జడ్జి అర్చనాకుమారిని ట్రైనీ కలెక్టర్‌ అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. రామదాసు వారసుడు, దేవస్థానం ఈవోలను అడ్డుకోవడం మచ్చలుగా మిగిలాయి. ఇలాంటివి పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారులకు తప్ప ఇతర శాఖల అధికారులకు మాత్రమే ఎదురవుతున్నాయి. దీంతో ఆయా శాఖల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమాచార శాఖ ఈ ఏడాది సైతం ముందస్తు ప్రణాళిక లేకుండా పాస్‌లు జారీ చేయడంతో గందరగోళంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement