●భద్రగిరి మార్ట్ ప్రారంభోత్సవంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
భద్రాచలం: స్వచ్ఛమైన, నాణ్యమైన గిరి జన ఉత్పత్తులను అందించేందుకు, గిరిజ నులు ఉపాధి పొందేందుకు ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ భేష్ అని గవర్నర్ శివ ప్రతాప్‌శుక్లా దంపతులు అన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రగిరి గిరిజ న మార్ట్‌ను గవర్నర్ శుక్లా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. మార్ట్‌లోని అటవీ ఉత్పత్తులను పరిశీలించారు. గవర్నర్ గిరిజన ఆయి ల్ ఉత్పత్తులను కొనుగోలు చేయగా, ఆయన సతీ మణి నగదును పీఓకు అందజేశారు. గిరిజన ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పీఓ చేసిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.


