గ్రంథాలయ సేవలు మెరుగు పరుస్తాం | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయ సేవలు మెరుగు పరుస్తాం

Mar 29 2026 7:11 AM | Updated on Mar 29 2026 7:11 AM

మణుగూరు రూరల్‌ : గ్రంథాలయ సేవలను మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పసుపులేటి వీరబాబు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ముత్యాలమ్మనగర్‌ గ్రామపంచా యతీ శాఖా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రంథాలయంలో వైఫై ఏర్పాటు చేసిన దూపకుంట్ల అనిల్‌ను అభినందించారు. అనంతరం పలువురికి గ్రంథాల య మెంబర్‌షిప్‌, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కొమరం జంపేశ్వరి, ఉపసర్పంచ్‌ శ్రీను నాయక్‌, గ్రంథాలయ సిబ్బంది గీత పాల్గొన్నారు.

అడవిని సంరక్షించాలి

చుంచుపల్లి/పాల్వంచరూరల్‌: అటవీ సంరక్షణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని కాంపా సీసీఎఫ్‌ క్షితిజ సూచించారు. శనివారం ఆమె చాతకొండ, హేమచంద్రాపురం, లోతు వాగు ప్లాంటేషన్లను, వనవిహార్‌ కాంప్లెక్స్‌లోని మీటింగ్‌ హాల్‌, కిన్నెరసాని డీర్‌ పార్కు, మందెరకలపాడు బీట్‌, సఫారీ రూట్లను పరిశీలించారు. అనంతరం ట్రెక్కింగ్‌ చేశారు. ప్లాంటేషన్లలో మొక్కల పెరుగుదల, సంరక్షణ చర్యలు, నీటి వనరుల వినియోగం, మట్టి సంరక్షణ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎఫ్‌ఓ కృష్ణగౌడ్‌, ఎఫ్‌డీఓ కోటేశ్వరరావు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement