నా భర్త అదృశ్యమయ్యాడు.. | - | Sakshi
Sakshi News home page

నా భర్త అదృశ్యమయ్యాడు..

Jan 13 2026 6:00 AM | Updated on Jan 13 2026 6:00 AM

నా భర్త అదృశ్యమయ్యాడు..

నా భర్త అదృశ్యమయ్యాడు..

పాల్వంచరూరల్‌: గత నెల మొదటి వారం నుంచి తన భర్త కన్పించడంలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు కల్ము నీత కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా మోర్పల్లికి చెందిన కల్ము అశోక్‌కుమార్‌ డిసెంబర్‌ మొదటి వారంలో పాల్వంచ మండలం ఉల్వనూరులో ఉంటున్న తన పిన్ని ఇంటికి వచ్చాడు. అదే రోజు దంతలబోరు, బండ్రుగొండ ప్రాంతాలకు వెళ్లాడు. అనంతరం బంధువుల ఇంటికి వెళ్తానని చెప్పి జగన్నాథపురం వరకు వచ్చి, ఆ తర్వాత కన్పించకుండాపోయాడు. నలుపురంగులోని సన్నని నిలువు గీతలు కలిగిన చొక్కాను ధరించి ఉన్నాడని భార్య తెలిపింది. మూడు రోజుల క్రితం పాల్వంచ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఈ విషయమై ఎస్‌ఐ బి.సురేశ్‌ను వివరణ కోరగా.. విషయం తన దృష్టికి తీసుకొచ్చారని, విచారణ జరుపుతామని తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళ ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement