● వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలన
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఐడీఓసీలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం నుంచి కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెబ్‌కాస్టింగ్ ద్వారా సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం జిల్లాలోని పలు కేంద్రాలకు వెళ్లి ప్రత్యక్షంగా పోలింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
సమస్యాత్మక కేంద్రాల్లో ఎస్పీ..
మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ రోహిత్‌రాజు బుధవారం సందర్శించారు. జూలూరుపాడు మండలం పాపకొల్లు, సుజాతనగర్ మండలం సర్వారం, లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ, టేకులపల్లి మండలం టేకులపల్లి, దాసుతండా పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.


