నేడు కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లాలోని గ్రామపంచాయతీల నుంచి కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను మంత్రి సన్మానిస్తారని క్యాంపు కార్యాలయం ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఐఎల్‌పీఏ సదస్సుకు రండి..
జడ్జీలకు న్యాయవాదుల ఆహ్వానం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఈనెల 20న కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించే ఇండియన్ లాయర్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్(ఐఎల్‌పీఏ) రాష్ట్ర సదస్సుకు హాజరు కావాలంటూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌తో పాటు పలువురు జడ్జీలను ఆహ్వానించారు. ఈ మేరకు అసోసియేషన్ జిల్లా కన్వీనర్ గోపీకృష్ణ బుధవారం ఆహ్వాన పత్రికలు అందజేశారు. జిల్లా జడ్జితో పాటు అదనపు జిల్లా జడ్జి ఎస్ సరిత, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్‌కుమార్, అదనపు సీనియర్ జడ్జి కర్నాటి కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.సుచరిత, రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ బి. రవికుమార్ తదితరులను ఆహ్వానించారు. కార్యక్రమంలో న్యాయవాదులు భానుప్రియ, నిరంజన్ రావు, అంబటి రమేష్, ఎండి సాధిక్ పాషా, ఎరప్రాటి కృష్ణ, వి.హరి, యెర్రా కామేష్, విజయ్ పాల్గొన్నారు.


