సాంకేతిక పరిజ్ఞానంతో సాగు లాభదాయకం
బూర్గంపాడు: రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తే పంటల సాగు లాభదాయకంగా మారుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం సోంపల్లిలో డ్రోన్‌తో నేరుగా వరి విత్తనాలు వెదజల్లే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాగులో సాంకేతికను ఆవలంబిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చన్నారు. డ్రోన్‌తో వరి విత్తనాలు నేరుగా వెదజల్లడంతో పాటు ఎరువులు, పురుగుమందులు, గడ్డి మందులు పిచికారీ చేయడం ద్వారా కూలీల ఖర్చు తగ్గుతుందని చెప్పారు. కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ మాట్లాడుతూ డ్రోన్‌తో వరి విత్తనాలు వెదజల్లే విధానంలో వేస్తే గింజలు తక్కువగా అవసరం పడతాయని తెలిపారు. డ్రోన్‌తో వరి విత్తనాలు వెదజల్లే విధానాలను రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త ఎన్.శరత్‌చంద్ర, ఉద్యాన శాస్త్రవేత్త శివ, ఏడీఏ తాతారావు, ఏఓ శంకర్, ఏఈఓ పవన్ పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్


