ఓటు కోసమే..
సత్తుపల్లి మండలం కాకర్లపల్లి మా గ్రామం. నేను హైదరాబాద్‌లో ఉంటూ టీవీ సీరియళ్లలో నటిస్తున్నా. నాకు ఐదు నెలల బిడ్డ ఉంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చా. – ఈర్ల హరిత, వెండితెర నటి, కాకర్లపల్లి
ఈ నెల 17న పోలింగ్ ఉందని గ్రామస్తులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అమెరికా నుంచి వచ్చా. ఎంతో సంతోషంగా ఉంది.
– చీకటి శ్రీనివాసరావు, ఎన్‌ఆర్‌ఐ, అన్నారుగూడెం
నేను హైదరాబాద్‌లో హోటల్ నిర్వహిస్తున్నాను. ఓటు వేసేందుకు కుటుంబ సమేతంగా వచ్చా. ఓట్ల రోజు నా స్నేహితులంతా కలిశారు. ఓటు వేయటం మా ఊరివాడిగా నా బాధ్యత. చాలా ఆనందంగా ఉంది. – చెరుకుమళ్ల రామారావు, కారేపల్లి
ఓటు కోసమే..
ఓటు కోసమే..


