పట్టభద్రురాలి గెలుపు
సుజాతనగర్: మండలంలోని గరీభ్‌పేట పంచాయతీ సర్పంచ్‌గా పట్టభద్రురాలు పూసం దివ్యతేజ ఎన్నికయ్యారు. ఎంఏ బీఈడీ చదివి ప్రైవేట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె 816 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఇరువర్గాల ఘర్షణ
టేకులపల్లి: మండలంలోని బద్దుతండాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మద్దిరాలతండాకు చెందిన నరేష్ ఓటు వేసేందుకు బద్దుతండాలోని పోలింగ్ కేంద్రానికి రాగా, గుర్తింపు కార్డు లేకపోవడంతో ఎన్నికల సిబ్బంది వెనక్కి పంపించారు. దీంతో ఇంటికి వెళ్లి ఐడీ కార్డు తీసుకుని వచ్చి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాడు. గమనించి కాంగ్రెస్ మద్దతుదారుడు, సర్పంచ్ అభ్యర్థి భూక్య గంగారావు రెండోసారి ఓటు వేసేందుకు వచ్చాడనే అనుమానంతో నరేష్‌ని పోలింగ్ బూత్ నుంచి బయటకు లాగి చేయిచేసుకున్నాడు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్‌ఐ అలకుంట రాజేందర్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
అక్క సర్పంచ్..
చెల్లె కలెక్టర్ !
తిరుమలాయపాలెం: మండలంలోని తెట్టెలపాడు సర్పంచ్‌గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన చిర్రా నర్సమ్మ గెలిచారు. ఆమె చెల్లె (పిన్ని కుమార్తె), కర్ణాటక రాష్ట్రంలోని గుల్బ ర్గా కలెక్టర్ హెప్సిబారాణి బుధవారం నర్సమ్మను అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ఆదర్శవంతమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. తొలుత నర్సమ్మ విజయంపై గ్రామంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యాన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బిల్లగిరి ధనుంజయ్, గుంటి పుల్లయ్య, చిర్రా కృష్ణయ్య పాల్గొన్నారు.
పట్టభద్రురాలి గెలుపు
పట్టభద్రురాలి గెలుపు


