నేడు ఫైనల్ ఫైట్!
ఏడు మండలాల్లో..
జిల్లాలోని ఏడు మండలాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు
145 జీపీలు, 1,071 వార్డులకు ఎన్నికలు
మొత్తం పంచాయతీలు
156
తుది విడత గ్రామ
పంచాయతీల వివరాలు
ఏకగ్రీవమైనవి 10
ఎన్నికలు జరిగేవి
145
మొత్తం వార్డులు
1,340
ఏకగ్రీవ వార్డులు 256
ఓటింగ్‌లో పాల్గొనే ఓటర్లు 1,75,074
బరిలో ఉన్న అభ్యర్థులు 3,272
ఎన్నికలు జరిగే వార్డులు 1,071
చుంచుపల్లి: జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి, విజేతలను ప్రకటిస్తారు. అందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. మండలాల వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి మంగళవారం ఉద్యోగులు సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరారు. సామగ్రి సహా ఉద్యోగుల చేరవేతకు 80 బస్సులు, 15 మినీ బస్సులు, 30 వరకు టాటా మ్యాజిక్ వాహనాలను వినియోగించారు.
10 ఏకగ్రీవం.. ఒకచోట బ్రేక్
చివరి విడతలో 156 గ్రామ పంచాయతీలు, 1,340 వార్డుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో జూలూరుపాడు సర్పంచ్ స్థానంతో పాటు పది వార్డులకు నిర్వహించాల్సిన ఎన్నికలు కోర్టు ఆదేశాలతో నిలిపివేశారు. ఇక ఆళ్లపల్లిలో రెండు, ఇల్లెందులో ఒకటి చొప్పున మొత్తం మూడు వార్డులకు రిజర్వేషన్ ప్రకారం నామినేషన్లు దాఖలు కాలేదు. మరోపక్క గుండాలలో మామకన్ను, దామరతోగు, లక్ష్మీదేవిపల్లి మండలంలో హరియాతండా, కారుకొండ, అనిశెట్టిపల్లి, సుజాతనగర్‌లో టూ ఇంక్లైన్, ఇల్లెందు మండలంలో ధనియాలపాడు, సుభాష్‌నగర్, జూలూరుపాడు మండలంలో శంభునిగూడెం, వినోభానగర్ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 145 పంచాయతీలు, ఏకగ్రీవ వార్డులు 256 మినహాయించి మిగిలిన 1,071 వార్డు స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. కాగా, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల నుంచి అధికారులు వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించనున్నారు.
అధికారుల పర్యవేక్షణ
మూడో విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల పరిధిలో ఉద్యోగులకు బ్యాలెట్‌బాక్సులు, ఇతర సామగ్రి అందించేందుకు మంగళవారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగూడెంలోని రామచంద్ర కళాశాల, జూలూరుపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్, సుజాతనగర్ జిల్లా పరిషత్ హైస్కూల్, గుండాలలో గురుకుల పాఠశాల, ఆళ్లపల్లి ఎంపీడీఓ కార్యాలయం, టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇల్లెందు సింగరేణి స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయగా ఉద్యోగులకు సామగ్రి అప్పగించిన అధికారులు ఎన్నికల నిర్వహణపై సూచనలు చేశారు. అనంతరం రూట్ల వారీగా వాహనాల్లో బయలుదేరి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కాగా, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకుడు సర్వేశ్వర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, ఎన్నికల అధికారి చక్రపాణిరెడ్డి, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఆర్‌డీఓ మధు, ట్రెయినీ కలెక్టర్ మురళి తదితరులు పర్యవేక్షించారు.
మండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు పీఎస్‌లు ఓటర్లు
ఆళ్లపల్లి 12 43 84 225 90 9,314
గుండాల 09 41 78 249 80 12,092
జూలురుపాడు 21 66 142 361 174 24,462
లక్ష్మీదేవిపల్లి 28 78 221 571 245 30,811
సుజాతనగర్ 12 32 80 199 102 13,598
టేకులపల్లి 36 112 244 609 312 42,068
ఇల్లెందు 27 98 222 588 255 42,729
మొత్తం 145 470 1,071 2,802 1,258 1,75,074
చివరి విడతగా జిల్లాలోని ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో 145 గ్రామ పంచాయతీలు, 1,071 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా చోట్ల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు 3,272 మంది పోటీలో ఉండగా, 1,75,074 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్లలో 85,712 మంది పురుషులు, 89,359 మంది మహిళలతో పాటు మరో ముగ్గురు ఇతరులు ఉన్నారు. ఎన్నికల నిమిత్తం 1,258 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు 3,818 మంది ఉద్యోగులను నియమించారు. ఇందులో 187 మంది రిటర్నింగ్ అధికారులు, 1,608 మంది పీఓలు, 1,884 ఓపీఓలు, 63 మంది రూట్ ఆఫీసర్లు, 24 మంది జోనల్ అధికారులతో పాటు 23 మంది ఎఫ్‌ఎస్‌టీ, 24 మంది ఎస్‌ఎస్‌టీ బృందాల సభ్యులు ఉన్నారు.
చివరి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం
నేడు ఫైనల్ ఫైట్!
నేడు ఫైనల్ ఫైట్!
నేడు ఫైనల్ ఫైట్!


