కంపెనీ స్థాయి క్రికెట్ టోర్నీ ఆరంభం
రుద్రంపూర్: సింగరేణి కంపెనీ స్థాయి క్రికెట్ టోర్నీ కొత్తగూడెం గౌతంపూర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే పోటీలను జీఎం(వెల్ఫేర్) జీవీ.కిరణ్‌కుమార్, ఇన్‌చార్జ్ జీఎం నర్సింహరావు ప్రారంభించారు. అనంతరం ఆరు ఏరియాల క్రీడాకారులను పరిచయం చేసుకున్న వారు మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చడం ద్వారా సంస్థ ఖ్యాతిని చాటాలని సూచించారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.
మొదటి రోజు ఫలితాలు
టోర్నీలో భాగంగా తొలిరోజు కొత్తగూడెం, కార్పొరేట్ – భూపాలపల్లి, ఆర్జీ–3 జట్లు తలపడగా కొత్తగూడెం, కార్పొరేట్ జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్ ఇల్లెందు, మణుగూరు – బెల్లంపల్లి, మందమర్రి జట్ల మధ్య జరగగా ఇల్లెందు – మణుగురు జట్టు గెలిచింది. శ్రీరాంపూర్ – ఆర్జీ–3, భూపాలపల్లి జట్ల నడుమ మరో మ్యాచ్‌లో ఆర్జీ–3, భూపాలపల్లి జట్లు విజయం సాధించింది.


