రాష్ట్ర బాక్సింగ్ పోటీలకు ఎంపిక
సూపర్‌బజార్(కొత్తగూడెం): హైదరాబాద్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల, మహిళల బాక్సింగ్ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేశారు. కొత్తగూడెంలోని బాక్సింగ్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం చీఫ్ ప్యాట్రన్ ఎర్రా కామేశ్ వివరాలు వెల్లడించారు. పురుషుల జట్టులో జిల్లా నుంచి బోడా జాన్, ఆర్విన్ వసుమూర్తి, ఎర్రా ధనుంజయ్, మహిళల జట్టులో పోట్లపువ్వు హరిప్రియకు స్థానం దక్కిందని తెలిపారు. కార్యక్రమంలో కోచ్ ఎస్‌కే అర్షద్ పాల్గొన్నారు.
పెదవాగు ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి
అశ్వారావుపేటరూరల్: గతేడాది భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పెదవాగు ప్రాజెక్టు పునఃనిర్మాణానికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలని ఏపీ సీపీఐ నాయకులు కోరారు. మండలంలోని గుమ్మడవల్లి వద్ద పెదవాగు ప్రాజెక్టును వారు మంగళవారం పరిశీలించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి వేలాది మంది రైతుల భవిష్యత్‌పై ముడిపడి ఉన్నందున ప్రాజెక్టుకు ఇరు రాష్ట్రాలు నిధులు కేటాయించాలని, లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సీపీ ఐ నాయకులు అక్కినేని వనజ, మన్నవ కృష్ణచైతన్య, బండి వెంకటేశ్వరరావు, ఎండీ మునీర్, పిట్టా ప్రసాద్, కారం దారయ్య ఉన్నారు.
రాష్ట్ర బాక్సింగ్ పోటీలకు ఎంపిక


