విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి
దుమ్ముగూడెం: విద్యార్థులు పాఠ్యపుస్తకాలు చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ సూచించారు. దుమ్ముగూడెంలోని కస్తూర్బా పాఠశాలను మంగళవారం సందర్శించిన ఆయన.. ప్రాంగణం తనిఖీ చేశాక బోధనపై ఉపాధ్యాయులతో చర్చించారు. అనంతరం తరగతులకు వెళ్లి విద్యార్థులకు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు చదువును నిరక్ష్యం చేయకుండా శ్రద్ధ వహిస్తే ఉన్నత స్థాయికి చేరొచ్చని తెలిపారు. అనంతరం దుమ్ముగూడెం రెవెన్యూ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆయన నిర్వహణ, దరఖాస్తుల పరిష్కారంపై సూచనలు చేశారు. తహసీల్దార్ అశోక్‌కుమార్, ఉద్యోగులు భరణిబాబు, కల్లూరు వెంకటేశ్వరరావు, గజ్జల నర సింహారావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


