పోటీ పరీక్షల్లో రాణించేలా చూడాలి
భద్రాచలం : గిరిజన విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేలా తర్ఫీదు ఇవ్వాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఖమ్మంలోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులకు గ్రూప్స్ కోచింగ్ పుస్తకాల కొనుగోలుకు రూ.45 వేల చెక్కును సోమవారం తన చాంబర్‌లో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల ఖమ్మంలోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలను సందర్శించానని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పుస్తకాలు కావాలని విద్యార్థులు కోరారని తెలిపారు. వివిధ రకాల నైపుణ్యాలు, పెయింటింగ్‌ల్లో వారికి అవగాహన కల్పించేలా ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు చొరవ చూపాలని సూచించారు. కెరీర్ గైడెన్స్‌పై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, కళాశాల ప్రిన్సిపాల్ రజిని తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


