ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి
జూలూరుపాడు/సుజాతనగర్ : ఈనెల 17న జరిగే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికారులు జాగ్రత్తలు పాటించాలని సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్‌రెడ్డి సూచించారు. సుజాతనగర్, జూలూరుపాడులో సోమవారం ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, సిబ్బందితో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల సిబ్బందికి తాగునీరు, భోజనం, విద్యుత్, స్ట్రాంగ్ రూమ్ వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని చెప్పారు. ఆయా సమావేశాల్లో జూలూరుపాడు తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఎంపీడీఓలు బి.భారతి, పూరేటి అజయ్, ఎంపీఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ తాళ్లూరి రవి పాల్గొన్నారు.
సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్‌రెడ్డి


