నిర్దిష్ట లక్ష్యాలతోనే విజయాలు | - | Sakshi
Sakshi News home page

నిర్దిష్ట లక్ష్యాలతోనే విజయాలు

Dec 16 2025 4:33 AM | Updated on Dec 16 2025 4:33 AM

నిర్దిష్ట లక్ష్యాలతోనే విజయాలు

నిర్దిష్ట లక్ష్యాలతోనే విజయాలు

ఖమ్మంఅర్బన్‌: విద్యార్థులు భవిష్యత్‌పై నిర్దిష్ట లక్ష్యాలను ఎంచుకుని సాధన చేస్తే విజయాలు వరిస్తాయని ఖమ్మం కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం టేకులపల్లిలోని మహిళా ప్రాంగణంలో శిక్షణ పొందిన విద్యార్థినులు ఎంపీహెచ్‌డబ్ల్యూ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి 2, 4, 5, 7, 8, 10వ ర్యాంకులు సాధించగా వారిని సోమవారం కలెక్టర్‌ అభినందించి మాట్లాడారు. పేద కుటుంబాలు, ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థినులు ఇక్కడితో ఆగిపోకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని సూచించారు. ర్యాంకులు సాధించిన జబ్బా పావని, మచ్చా శ్రావణి, దేవత్‌ సంధ్యవిక, చిదిం మౌనిక, బానోతు కల్పన, పగిడిపల్లి రాజేశ్వరితో పాటు మహిళా ప్రాంగణం మేనేజర్‌ వేల్పుల విజేత, ఉద్యోగులు నాగ సరస్వతి, స్పందన, మల్లిక, సుధీర్‌, సుకన్య, మౌనిక, లాలయ్య పాల్గొన్నారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

సెల్ఫీ వీడియో కలకలం

భద్రాచలంటౌన్‌: భద్రాచలంలో మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత ఆత్మహత్యకు యత్నించడం సోమవారం కలకలం రేపింది. ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఓ మహిళకు న్యాయం చేసేందుకు వెళ్లినప్పుడు దళిత సంఘ నాయకులు తనపై వేధింపులకు పాల్పడ్డారని వీడియోలో ఆమె పేర్కొంది. వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. కాగా కుటుంబ సభ్యులు ఆమెను భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని సీఐ నాగరాజు తెలిపారు.

వ్యక్తికి గాయాలు

సుజాతనగర్‌: కారు, బైక్‌ ఢీకొని ఒకరికి గాయాలైన ఘటన సోమవారం జరిగింది. కొత్తగూడెంలోని పెనగడపకు చెందిన కిరణ్‌ ద్విచక్రవాహనంపై ఖమ్మం వెళ్తున్నాడు. అదే సమయంలో ఖమ్మం వైపు వెళ్తున్న కారు నందనవనం సమీపంలో యూ టర్న్‌ తీసుకునే క్రమంలో డ్రైవర్‌ కొద్ది దూరం వెనుకకు రానిచ్చాడు. ఈ క్రమంలో కొత్తగూడెం వైపు నుంచి వస్తున్న ద్విచక్రవాహనం కారు వెనుకభాగంలో ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు.

పినపాకలో ఇరువర్గాల వాగ్వాదం

తల్లాడ: మండలంలోని పాత పినపాక గ్రామంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గీయు ల మధ్య సోమవారం వాగ్వాదం చోటు చేసుకుంది. పినపాకకు చెందిన బీఆర్‌ఎస్‌ తరఫున వార్డుసభ్యులుగా పోటీ చేస్తున్న ఎక్కిరాల నాగేశ్వరరావు, ఎక్కిరా ల అనసూర్య, తేళ్లపుట్ల లక్ష్మి, తేళ్లపుట్ల కుమారి, తేళ్లపుట్ల మహేష్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు చెందిన గుర్రం నాగేశ్వరరావు, ఆళ్ల శ్రీను, గుర్రం శివరాం, తేళ్లపుట్ల నాగేశ్వర్‌రావు, నర్వనేని శ్రీను తదితరులు ఎక్కిరాల నాగేశ్వరరావుపై దాడికి యత్నించారని ఆరోపించారు. అయితే, బీఆర్‌ఎస్‌ నేతలే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఎక్కిరాల ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదు అందిందని ఎస్సై ఎన్‌.వెంకటకృష్ణ తెలిపారు.

న్యూలక్ష్మీపురంలో ఘర్షణ

ముదిగొండ: మండలంలోని న్యూలక్ష్మీపురంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య సోమవారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు గ్రామ రహదారిపైకి చేరడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు చేరుకుని ఇరువర్గాల వారిని పంపించారు. అయితే, రాళ్లు, కర్రలతో తమపై దాడి చేశారంటూ ఇరువర్గాల వారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నూతన వార్డుసభ్యుడి మృతి

రఘునాథపాలెం: మండలంలోని మంగ్యాతండా గ్రామ వాసి, ఈనెల 11న వార్డుమెంబర్‌గా ఎన్నికై న కొడకళ్ల వెంకటాచారి(45) మృతి చెందాడు. గ్రామ ఒకటో వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వడ్రంగిగా జీవనం సాగించే ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమేరకు వెంకటాచారి చిత్రపటం వద్ద నూతన సర్పంచ్‌ మాలోతు భార్గవి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్‌, నాయకులు రవికిరణ్‌, నాగేశ్వరరావు, రమేశ్‌, నాగాచారి, భాస్కర్‌ నాయకులు నివాళులర్పించారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం బల్లెపల్లికి చెందిన ఓ వ్యక్తి కానరాకుండా పోయిన ఘటనపై కేసు నమోదైంది. బల్లేపల్లికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ గండు వెంకన్న(42) గత నెల 25న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆయన కుమారుడు నవీన్‌ ఫిర్యాదు ఖమ్మం అర్బన్‌ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement