తుది విడతలో 10 జీపీలు ఏకగ్రీవం
చుంచుపల్లి: మూడో విడత ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీలు, వార్డులకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. బుజ్జగింపులు, బేరసారాలు జరగడంతో చివరి నిమిషంలో కొందరు నామినేషన్లు ఉపసంహరించుకోగా ఆయా స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 155 గ్రామపంచాయతీలు, 1,330 వార్డులకు ఈనెల 17న మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కోర్టు ఆదేశాలతో జూలూరుపాడు పంచాయతీకి ఎన్నికల ప్రక్రియ నిలిచిన విషయం విదితమే. ఇక నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 10 గ్రామ పంచాయతీలు, 224 వార్డు స్థానాలు ఏకగ్రీవంగా నిలిచాయి. మొదటి విడతలో 14 జీపీలు, 336 వార్డులు, రెండో విడతలో 16 జీపీలు, 240 వార్డులు, మూడో విడతలో 10 జీపీలు, 224 వార్డులు ఏకగ్రీవం కావడం విశేషం. తుది విడత ఎన్నికల బరిలో నిలిచే సర్పంచ్, వార్డుల అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించగా.. బుధవారం నుంచి వీరి ప్రచారపర్వం ప్రారంభం కానుంది.
ఏకగ్రీవంగా నిలిచినవివే..
సుజాతనగర్ మండలంలో టూ ఇంకై ్లన్ గ్రామపంచాయతీ సర్పంచ్‌తో పాటు మొత్తంగా 30 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 12 పంచాయతీలు, 80 వార్డులకు పోలింగ్ జరుగనుంది. ఆళ్లపల్లిలో 12 పంచాయతీలు, 90 వార్డులకు గాను నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. గుండాలలో 11 గ్రామపంచాయతీలు, 96 వార్డులకు మామకన్ను, దామరతోగు జీపీలతో పాటు 18 వార్డులు ఏకగ్రీవంగా నిలిచాయి. 9 గ్రామపంచాయతీలు, 78 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు. జూలూరుపాడు మండలంలో శంభునిగూడెం, వినోభానగర్ జీపీలతో పాటు 14 వార్డులు ఏకగ్రీవం కాగా, 23 గ్రామపంచాయతీలు, 174 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. లక్ష్మీదేవిపల్లిలో హరియాతండా, కారుకొండ, అనిశెట్టిపల్లి గ్రామపంచాయతీలు, 39 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 28 పంచాయతీలు, 251 వార్డులకు పోలింగ్ జరగనుంది. టేకులపల్లి మండలంలో 68 వార్డు స్థానాలు మాత్రమే ఏకగ్రీవం కాగా, 36 గ్రామపంచాయతీలు, 244 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇల్లెందు మండలంలో 29 గ్రామపంచాయతీలు, 274 వార్డులకు గాను సుభాష్‌నగర్, ధనియాలపాడు గ్రామ పంచాయతీలతో పాటు 51 వార్డులు ఏకగ్రీవంగా నిలిచాయి. మిగిలిన 27 జీపీలు, 223 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.
224 వార్డు స్థానాలు కూడా..


