వృద్ధులకు చట్టపరమైన రక్షణ అవసరం
సుజాతనగర్: వృద్ధులకు గౌరవంతో పాటు చట్టపరమైన రక్షణ అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ అన్నారు. పాత అంజనాపురంలో ఇటీవల ఏర్పాటైన వృద్ధాశ్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, వృద్ధులను గౌరవించడం చట్టపరమైన భాద్యత అన్నారు. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం –2007 గురించి వివరించారు. ఆశ్రమం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిర్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తం రావు, ఆశ్రమ నిర్వాహకులు పోటు రాఘవరావు, కొల్లు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మహిళా సమాఖ్య సభ్యులు మంగళవారం ఆవిష్కరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోగా, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత పర్యవేక్షణలో వేడుక నిర్వహించారు.
ఉపాధ్యాయురాలికి ఉత్తమ అవార్డు
భద్రాచలంటౌన్/పాల్వంచ : భద్రాచలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోని భవిత కేంద్రంలో పనిచేస్తున్న ఐఈఆర్‌పీ రేగళ్ల సుమలత జిల్లా స్థాయి ఉత్తమ ఇంక్లూజివ్ టీచర్‌గా ఎంపికయ్యారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాల్వంచలోని ఐడీఓసీలో అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఈఓ నాగలక్ష్మి సుమలతను అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో సుమలత మాట్లాడుతూ.. తనకు ఈ పురస్కారం రావడానికి సహకరించిన ఐఈ కో ఆర్డినేటర్ సైదులు, విద్యా శాఖాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
13న నవోదయ
ప్రవేశ పరీక్ష
కొత్తగూడెంఅర్బన్ : 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 13న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రవేశ పరీక్షకు జిల్లా నుంచి 1,852 మంది విద్యార్థులు హాజరవుతారని, ఇందుకోసం జిల్లాలో 8 సెంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. అశ్వారావుపేటలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలుర, భద్రాచలంలోని ఎస్‌ఎన్‌ఎం జెడ్పీహెచ్‌ఎస్ కొర్రాజులగుట్ట, భద్రాచలం జీహెచ్‌ఎస్, బూర్గంపాడు జీహెచ్‌ఎస్, కొత్తగూడెంలో సింగరేణి పాఠశాల, సెయింట్ మేరీస్, ఇల్లెందులోని సింగరేణి స్కూల్, జీహెచ్‌ఎస్ జేబీఎస్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 13వ తేదీ ఉదయం 11.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని, గంట ముందుగానే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే 94906 55706 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
వృద్ధులకు చట్టపరమైన రక్షణ అవసరం
వృద్ధులకు చట్టపరమైన రక్షణ అవసరం
వృద్ధులకు చట్టపరమైన రక్షణ అవసరం


