ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలి
జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి
కరకగూడెం : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి సూచించారు. శుక్రవారం ఆమె కరకగూడెం మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, షెడ్లు, దివ్యాంగులకు ర్యాంపుల వంటి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం బ్యాలెట్ పత్రాలను ఆమె పరిశీలించారు. ఎంపీడీఓ కుమార్, ఎంపీఓ మారుతీ యాదవ్, అధికారులు పాల్గొన్నారు.
హాజరుశాతం పెరగాలి
పినపాక: పాఠశాలలో విద్యార్థులు హాజరుశాతం పెంచడంతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ నాగలక్ష్మి అన్నారు. శుక్రవారం మండలంలో భూపాలపట్నం పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి జ్ఞాపక శక్తిని పరిశీలించారు. ఎంఈఓ నాగయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలి


