నామినేషన్ ఫీజు కోసం భిక్షాటన
జూలూరుపాడు: మండలంలోని కాకర్ల సర్పంచ్‌గా బరిలోకి దిగుతున్న స్వతంత్ర అభ్యర్థి బానోత్ బద్రి నామినేషన్ ఫీజు కోసం శుక్రవారం భిక్షాటన చేశారు. దుబ్బతండాకు చెందిన బానోత్ బద్రి తన భర్త శ్రీను, తదితరులతో కలిసి ఓటర్లను కలిసి నామినేషన్ ఫీజు కోసం విరాళాలు కోరగా రూ.3వేలు సమకూరాయి. ఆ నగదుతోనే సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. కాగా, 2019లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ పోటీ చేసిన బద్రి 506ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని, తద్వారా కాకర్ల గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


