పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
కొత్తగూడెంటౌన్: ఈనెల 15న జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. గురువారం జిల్లా కోర్టులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసుల్లో సాక్షులను కోర్టుల వారీగా తీసుకురావాలని అన్నారు. చెక్కు బౌన్స్ కేసుల్లో ఫిర్యాదుదారుల సహకారంతో వారెంట్లను అమలు పర్చాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్‌అదాలత్ ఏర్పాటు చేశామని, ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.సరిత, జిల్లా లీగల్ సర్వీసెస్ అఽథారిటీ సెక్రటరీ ఎం.రాజేందర్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్‌కుమార్, మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ, ఎస్పీ రోహిత్‌రాజు, అదనపు కలెక్టర్ డి,వేణుగోపాల్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెదు డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్ సూజాత తదితరులు పాల్గొన్నారు. కాగా, సెప్టెంబర్ 13న జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో అత్యదికంగా కేసుల పరిష్కారానికి కృషి చేసిన కోర్టు కానిస్టేబుళ్లు, లైజన్ అధికారులకు జిల్లా జడ్జి, ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్


