పోడు భూముల్లో కందకాలు..
చర్ల: పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు గురువారం కందకాలు తవ్వుతుండగా గిరిజనులు అడ్డుకోవడంతో వాగ్వాదం నెలకొంది. మండలంలోని తిమ్మిరిగూడెం సమీపంలోని అటవీ భూముల్లో జంగాలపల్లి, తిమ్మిరిగూడెం గ్రామాల గిరిజనులు పోడు భూముల్లో వరి, పత్తి సాగు చేపట్టారు. అవి చేతికందే దశలో ఉండగా ఆ భూముల్లోకి వెళ్లకుండా అటవీశాఖ అధికారులు జేసీబీతో కందకాల తవ్వకం చేపట్టారు. దీంతో గిరిజనులు చేరుకుని పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. గిరిజనులు జేసీబీని దగ్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సీఐ రాజువర్మ సిబ్బందితో అక్కడికి చేరుకుని అటవీశాఖాధికారులు, గిరిజనులతో మాట్లాడి శాంతింపజేశారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న తమ భూముల జోలికి రావొద్దని ఈ సందర్భంగా గిరిజనులు డిమాండ్ చేశారు.
అడ్డుకున్న గిరిజనులు, అటవీ
అధికారులతో వాగ్వాదం


