వైభవంగా చండీహోమం
పాల్వంచరూరల్ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి ఆలయంలో బుధవారం వైభవంగా చండీహోమం నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేద మంత్రాలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతి పూజ అనంతరం చండీహోమం గావించి చివరకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చండీహోమంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు.
శివాలయంలో ఎస్పీ పూజలు
ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి) : కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఎస్పీ రోహిత్‌రాజ్ సందర్శించారు. గర్భగుడిలో ప్రత్యేక అభిషేకం అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం వాయులింగం, హోమగుండం, ధ్వజస్తంభాన్ని దర్శించుకుని పూజలు చేశారు. ఆయన వెంట కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్. జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై విజయసింహారెడ్డి తదితరులు ఉన్నారు.
సింగరేణిలో 22 మంది అధికారుల బదిలీ
కొత్తగూడెంఅర్బన్: సింగరేణిలో వివిధ విభాగా లకు చెందిన 22 మంది అధికారులను బదిలీ చేస్తూ ఈఈ సెల్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో మైనింగ్ విభాగానికి చెందిన 18 మంది, ఐటీ విభాగానికి చెందిన నలుగురు అధికారులు ఉన్నారు.
నేడు జిల్లా స్థాయి
యువజన కళాకారుల ఎంపిక
డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి వెల్లడి
కొత్తగూడెంటౌన్: జాతీయ యువజనోత్సవం సందర్భంగా కొత్తగూడెం క్లబ్‌లో గురువారం జిల్లాస్థాయి కళాకారులను ఎంపిక చేయనున్న ట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జానపద నృత్యం(గ్రూప్), జానపద గేయాలు(గ్రూప్), కవిత్వం, పెయింటింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, సైన్స్ మేళా తదితర విభాగాల్లో ఎంపికలు ఉంటాయని వివరించారు. పోటీల్లో పాల్గొ నే అభ్యర్థులు 15–29 ఏళ్ల మధ్య వయసు గలవారై ఉండాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని, అక్కడ గెలు పొందిన వారిని 2026 జనవరి 12 నుంచి 16 వరకు నిర్వహించే జాతీయస్థాయి యువజనో త్సవాలకు పంపిస్తామని వెల్లడించారు. నేడు జరిగే ఎంపిక పోటీలకు అధికసంఖ్యలో యువ తీ, యువకులు హాజరు కావాలని కోరారు.
వ్యాక్సిన్లతో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ
ఖమ్మంవైద్యవిభాగం: గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులకు వైద్యుల సూచనల ప్రకారం తప్పనిసరి టీకాలు వేయించాలని ఖమ్మం జిల్లా వాక్సిన్ మేనేజర్ సీ.హెచ్.రమణ సూచించారు. ఖమ్మంలోని ముస్తఫానగర్, శ్రీనివాసనగర్, వెంకటేశ్వరనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం ఆయన వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పాటు టీకా నిల్వ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు టీకాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణకు టీకాలు వేస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, ప్రతీ బాలింత బిడ్డకు ముర్రుపాలు విధిగా ఇవ్వాలని తెలిపారు. కాగా, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సైతం టీకాలు, ముర్రుపాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని రమణ సూచించారు.
వైభవంగా చండీహోమం
వైభవంగా చండీహోమం


