స్మార్ట్ ఫోన్ నుంచే లైఫ్ సర్టిఫికెట్..
నేటి నుంచి సింగరేణిలో
అవగాహన సదస్సులు
కొత్తగూడెంఅర్బన్: ఏటా నవంబర్‌లో సింగరేణి పింఛన్‌దారులు ఆన్‌లైన్ సెంటర్లు, మీ సేవ కేంద్రాల్లో లైఫ్ సర్టిఫికెట్లు పొంది కొత్తగూడెంలోని సింగరేణి సీఎంపీఎఫ్ కార్యాలయంలో సమర్పిస్తుంటారు. ఈ ప్రక్రియలో వృద్ధులు ఎదుర్కొంటున్న అవస్థలను తొలగించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. కాగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. పెన్షనర్లలో డిజిటల్ సాధికారత పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టగా, స్మార్ట్ ఫోన్ నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే అవకాశం కల్పించారు. దీంతో సింగరేణిలో కూడా ఇదే పద్ధతి అనుసరించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. జీవన్‌ప్రమాణ్ యాప్‌లో ముఖం గుర్తింపు ఆధారంగా వివరాలు, ఫొటో నమోదు చేస్తే, అవి సీఎంపీఎఫ్, సింగరేణి ప్రధాన కార్యాలయానికి చేరుతాయి. వాటి ఆధారంగా పింఛన్, హెల్త్ కార్డులను రెన్యూవల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. గురువారం నుంచి అవగాహన క్యాంపులు నిర్వహించనున్నారు. నేడు సింగరేణి ప్రధాన కార్యాలయంలో, ఈ నెల 11న ఇల్లెందులో, 14న రుద్రంపూర్ ఆర్‌సీఓఏ క్లబ్‌లో, 19న మణుగూరులో క్యాంపులు నిర్వహించనున్నారు. క్యాంపులకు వచ్చేవారు దంపతుల ఆధార్ కార్డు జిరాక్స్, ఓటీపీ కోసం మొబైల్ ఫోన్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, సీపీఆర్‌ఎంఎస్ మెడికల్ కార్డ్ జిరాక్స్‌లు, బ్యాంక్‌అకౌంట్ పాస్‌బుక్ జిరాక్స్‌లు తీసుకురావాలని సింగరేణి వెల్ఫేర్ విభాగం జీఎం జీవీ కిరణ్‌కుమార్ తెలిపారు.


