కనకగిరి గుట్టలపై కలెక్టర్
చండ్రుగొండ : కార్తీక పౌర్ణమి సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామశివారు కనకగిరి గుట్టలను సందర్శించారు. తండ్రి ఈవ్వనాధ్ పాటిల్, ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మతో కలిసి 8 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వీరభద్రస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. మొత్తంగా 16 కిలోమీటర్ల మేర వారి కాలినడక సాగగా.. కాకతీయుల కట్టడాలను పరిశీలించారు. గుట్టపైనున్న కోనేరు నీటిని తాగి అమృతంలా ఉందని అన్నారు. తర్వాత వాకీటవర్ పైకి ఎక్కిన కలెక్టర్.. పలు గుట్టలు, చెరువులను పరిశీలించారు. కనకగిరి గుట్టల ప్రకృతి అందాలను తండ్రి ఈవ్వనాధ్ పాటిక్‌కు వివరించారు. ఆలయంతోపాటు అడవిలోని కొన్ని ప్రాంతాల్లో సోలార్ లైట్లు కావాలని స్థానిక ఆదివాసీలు కలెక్టర్‌ను కోరగా వారం రోజుల్లో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
తండ్రితో కలిసి 16 కిలోమీటర్లు కాలినడక


