మండలాల వారీగా
కూరగాయల సాగు వివరాలు..
మండలం రైతులుసాగు (ఎకరాల్లో)
జిల్లాలో 843 ఎకరాల్లోనే సాగు
ఐదు మండలాల్లో మరీ తక్కువ
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో సంప్రదాయ, వాణిజ్య పంటలు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నపై మాత్రమే రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించడం లేదు. మూడేళ్లుగా వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రభుత్వ ఆదేశాల మేరకు చేసిన సమష్టి కృషి ఫలితంగా ఆయిల్‌పామ్ వైపునకు రైతులు మొగ్గు చూపుతున్నారు. లాభదాయకమైన కూరగాయలు, పండ్లు, ఇతర ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపడం లేదు. ప్రధానంగా జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగు పట్ల రైతాంగం ఆసక్తి కనబర్చక పోవడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
వినియోగం ఎక్కువే..
జిల్లా ఉద్యాన శాఖ అధికార గణాంకాల ప్రకారం ఒకరోజుకు ఒక మనిషికి 200 గ్రాముల కూరగాయలు అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ జిల్లాగా గుర్తింపు పొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల గిరిజన, ఆదివాసీ గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో జనాభా అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం నడుస్తున్న కార్తీకమాసం, అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, హనుమాన్ దీక్షల సందర్భాల్లో ప్రజలు ఎక్కువగా కూరగాయలనే వాడుతారు.
ఈ నేపథ్యంలో జిల్లాలోని 23 మండలాల్లో కేవలం 705 మంది రైతులు 843.17 ఎకరాల్లో మాత్రమే కూరగాయల సాగు చేస్తున్నారంటే ఇతర ప్రాంతాల నుంచి ఏమేరకు కూరగాయలు దిగుమతి అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రైతులు రక్షణ చర్యలు చేపట్టి కూరగాయల సాగువైపు దృష్టి సారిస్తే డిమాండ్ ఉన్న కారణంగా అధిక లాభాలు పొందవచ్చని అధికార యంత్రాంగం సూచిస్తున్నా రైతులు తమ సంప్రదాయ పంటల సాగు నుంచి దృష్టి మరల్చడం లేదు. జిల్లాలో కోతుల బెడద కూడా ఎక్కువగా ఉండడంతో తాము కూరగాయల సాగు చేయలేక పోతున్నామని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలోని 23 మండలాల్లో సుజాతనగర్ మండలంలో అధికంగా 242 మంది రైతులు 344.15 ఎకరాలలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తుండగా ములకలపల్లి, భద్రాచలం, చుంచుపల్లి, ఆళ్లపల్లి, బూర్గంపాడు, పినపాక ప్రాంతాల్లో కనీసం మూడు ఎకరాల్లో కూడా కూరగాయల సాగును రైతులు చేయకపోవడం గమనార్హం.
కూరగాయలు పండించాలంటే కోతుల భయం ఎక్కువగా ఉంది. సమీప ప్రాంతాల్లో అడవీ ఉన్నా వాటికి ఆహారం దొరకక పోవడంతో పంట పొలాల మీద దాడి చేస్తున్నాయి. దీంతో కూరగాయలను పండించలేక పోతున్నాం.
–కల్తీ ముత్తయ్య, రైతు,
కన్నాయిగూడెం, గుండాల మండలం
సంప్రదాయ పంటలతో వచ్చే నష్టాలను అధిగమించేందుకు ఉద్యాన, కూరగాయల సాగు వైపు దృష్టి సారించాలి. ఈ విషయమై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. దీంతో కొందరు ఉద్యాన పంటలపై మక్కువ చూపుతున్నారు. కూరగాయల సాగుకు ముందుకు రావడం లేదు.
–జంగా కిశోర్, ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారి
సుజాతనగర్ 242 344.15
టేకులపల్లి 105 148.22
జూలూరుపాడు 87 86.32
మణుగూరు 48 51.36
పాల్వంచ 42 42.34
దుమ్ముగూడెం 34 24.25
చర్ల 31 9.2
అశ్వాపురం 25 28.38
చండ్రుగొండ 25 27.2
కొత్తగూడెం 22 24.29
అశ్వారావుపేట 08 11.8
ఇల్లందు 06 8.2
భద్రాచలం 06 2.2
లక్ష్మీదేవిపల్లి 05 8.11
అన్నపురెడ్డిపల్లి 04 4.15
దమ్మపేట 03 9.6
చుంచుపల్లి 03 2.2
ఆళ్లపల్లి 03 1.32
పినపాక 03 1.17
బూర్గంపాడు 02 2.33
ములకలపల్లి 01 1.2
మొత్తం 705 843.17
రైతుల నుంచి ఆదరణ కరువు
కూరగాయల సాగు అంతంతే...
కూరగాయల సాగు అంతంతే...
కూరగాయల సాగు అంతంతే...


