కోడి పుంజుకు నాలుగు కాళ్లు!
అశ్వారావుపేటరూరల్: సాధారణంగా కోళ్లకు రెండు కాళ్లు ఉండటం సహజమే. కానీ ఓ కోడి పుంజుకు నాలుగు కాళ్లు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మండలంలోని నారంవారిగూడేనికి చెందిన నరదల నాగరాజు కొంతకాలంగా కోళ్లను పెంచుతున్నాడు. ఏడాదిన్నర క్రితం ఓ పెట్ట గుడ్లను పెట్టి పొదగగా అందులోని ఓ కోడి పుంజు (పచ్చాకాకి జాతి)కు నాలుగు కాళ్లు వచ్చాయి. కాగా, జన్యుపరమైన లోపం కారణంగా పుంజు నాలుగు కాళ్లతో జన్మించిందని తెలుస్తోంది. కొన్ని పుంజులు దీంతో పోట్లాడుతుండగా నాలుగు కాళ్లు చూసి పారిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.


