
పీఎంశ్రీతో నాణ్యమైన విద్య
అనుభవపూర్వక బోధన
పథకానికి తొలివిడతలో
నాలుగు పాఠశాలల ఎంపిక
ఏఆర్, వీఆర్ టెక్నాలజీతో
అనుభవపూర్వక బోధన
విద్యార్థుల్లో సృజనాత్మకత,
ఆసక్తి పెంచేలా కృషి
సృజనాత్మకత పెరుగుతుంది
అద్భుతంగా ఉంది
కరకగూడెం: {糿¶æ$™èlÓ ´ëuý‡-Ô>-ÌS-ÌZÏ A™éÅ-«§ýl$-°MýS sñæM>²-ÌS-i™ø »Z«§ýl¯]l ^ólç³-sôæt…§ýl$MýS$ MóS…{§ýl {糿¶æ$-™èlÓ… "ï³-G… çÜ*PÌŒæÞ çœÆŠæ OÆð‡h…VŠæ C…yìlĶæ* (ï³-G…}) ç³£ýlMýS… AÐ]l$-Ë$ ^ólÝù¢…¨. hÌêÏ-ÌZ ï³G…} ç³£ýl-M>°MìS 24 ´ëuý‡-Ô>-ÌS-ÌS¯]l$ G…í³MýS ^ólĶæ$-V>, ™öÍ Ñyýl-™èl-ÌZ Mö™èl¢-VýS*-yðl…ÌZ° MýS*ÎOÌñ毌l, ^èl$…^èl$-ç³-ÍÏÌZ° »êº$M>Å…ç³# VýSÆŠḥÏÞ OòßæçÜ*PÌŒæ, ´ëÌS-Ó…^èl gñæyîlµ-òßæ-^Œl-G‹Ü »êÍMýSÌS ´ëuý‡-Ô>ÌS, º*Æý‡Y…´ë-yýl$-ÌZ° ÝëÆý‡-´ëMýS {糿¶æ$™èlÓ ´ëuý‡-Ô>-ÌS-ÌZÏ Ýë…MóS-†MýS »Z«§ýl¯]l A…§ýl$-»êr$-ÌZMìS Ð]l_a…¨. AVðSÃ…sôæ-çÙ¯Œl ÇĶæ*-Ísîæ (HBÆŠæ), Ð]lÆý‡$a-Ð]lÌŒæ ÇĶæ*-Ísîæ (ÒBÆŠæ)° Eç³-Äñæ*-W…_ ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ ´ëu>-Ë$ »Z«¨-çÜ$¢-¯é²Æý‡$. A«§ýl$-¯é™èl¯]l Ýë…MóS-†MýS ç³Çgêq-¯]l…-™ø MýS*yìl¯]l ÑË$OÐðl¯]l ÝëÐ]l$-{W° OòÜ™èl… ´ëuý‡-Ô>-ÌS-ÌSMýS$ A…¨…-^éÆý‡$.
ఆధునిక పరికరాలు పంపిణీ
పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేసిన పాఠశాలకు సుమారు రూ.10లక్షల విలువైన అధునాతన ఐసీటీ (సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ) పరికరాలతో కూడిన కిట్‌ను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. కిట్‌లో ప్రత్యక్ష అనుభూతి ద్వారా అభ్యసనం కోసం ఏఆర్/వీఆర్ డివైజ్‌లు, హెడ్‌సెట్‌లు, స్మార్ట్ బోర్డులు, వీడియో రికార్డింగ్ ల్యాబ్‌లు, కంప్యూటర్, ట్రాలీ, టాబ్లెట్ పీసీ తదితర డిజిటల్ లెర్నింగ్ టూల్స్ అందజేశారు. వీటితో 21శతాబ్దంలో ముఖ్యమైన నైపుణ్యాలపైన సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యాలు విద్యార్థుల్లో పెంపొందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
పాఠశాలల్లో అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో రసాయనిక చర్యలు, భౌగోళిక అంశాలు, శరీర నిర్మాణ శాస్త్రం తదితర అంశాల బోధనతోపాటు ఏఆర్, వీఆర్ హెడ్‌సెట్ల ద్వారా ఆయా అంశాలను ప్రత్యక్షంగా వీక్షించడం, అనుభూతి చెందడం సాధ్యమవుతోంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆధునిక టెక్నాలజీతో కూడిన బోధన అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు నాణ్య మైన విద్య అందే అవకాశం ఉంది. ఇక అధునాతన పరికరాల వినియోగంపై ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఇటీవల శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. నూతన బోధనా పద్ధతుల ను అందిపుచ్చుకోవడంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
పీఎంశ్రీ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికత ప్రవేశపెట్టింది. విద్యార్థులు చూసి నేర్చుకోవడం, అనుభవంతో అర్థం చేసుకోవడం’అనే కొత్త పద్ధతిలో బోధన సాగుతుంది. ఏఆర్, వీఆర్ పరికరాల ద్వారా బోధన పిల్లల్లో ఆసక్తి, సృజనాత్మకత పెంచుతుంది. –నాగరాజశేఖర్,
జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్
పుస్తకాల్లో చదివిన దృగ్విషయాలను వీఆర్ హెడ్‌సెట్ ద్వారా కళ్లముందు చూస్తున్నాం. సైన్స్ పాఠంలో హృదయ నిర్మాణం, స్పందనలు త్రీడీలో చూడటం అద్భుతంగా ఉంది. అగ్నిపర్వతాల పాఠం చెప్పినప్పుడు వీఆర్ హెడ్‌సెట్ పెట్టుకుంటే నిజంగా లావా బయటకు వస్తున్నట్టే అనిపించింది. –తేజస్విని,
10Ð]l ™èlÆý‡-VýS† ѧéÅ-Ǧ°, VýSÆŠḥÏÞ OòßæçÜ*PÌŒæ, »êº$M>Å…ç³#

పీఎంశ్రీతో నాణ్యమైన విద్య

పీఎంశ్రీతో నాణ్యమైన విద్య