
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు ఆది వారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరినస్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.
కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు
కార్తీకమాసం సందర్భంగా శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దామోదర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. మొదటి సోమవారం 27న భస్మాభిషేకం, నదీహారతులు, నవంబర్ 3న చందనోత్సవం, 5న కార్తీకపౌర్ణమి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రుద్రాభి షేకం, సాయంత్రం నదీహారతులు, జ్వాలతోరణం జరుపుతామని పేర్కొన్నారు. 9న స్వామి వారి కల్యాణ మహోత్సవం, సాయంత్రం గ్రామోత్సవం, 10న పుష్పోత్సవం, 17న ఏకా దశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, 16న గోదావరి నదీతీరంలో నదీ హారతులు ఉంటాయని వెల్లడించారు. ప్రతీ సోమవారం సాయంత్రం జ్యోతిర్లింగార్చన, ఆకాశదీపోత్సవం, నీరాజన మంత్రపుష్పం, రోజూ సాయంత్రం 6 గంటల నుంచి సామవేద పండితులు డీఎస్‌ఎస్ సన్యాసి శర్మ కార్తీక పురాణ ప్రవచనాలు చేస్తారని వివరించారు.
స్వామివారికి విరాళాలు
హనుమకొండకు చెందిన సముద్రాల రామనరసింహాచార్యులు, సుజాత దేవిదంపతులు రామదాసు పీఠం మూలనిఽధికి రూ.1,00,101, సికింద్రాబాద్ కు చెందిన కడియాల సత్యనారాయణ, కమల దంపతులు రూ. లక్ష శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి విరాళంగా అందించారు. దాతలకు ఆలయ ఏఈవో శ్రవణ్‌కుమార్ రశీదులు అందజేశారు. ఆలయ పర్యవేక్షకుడు లింగాల సాయిబాబు, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచా ర్యులు పాల్గొన్నారు.
22 నుంచి శివాలయంలో కార్తీక పూజలు