
హోరెత్తిన తాలిపేరు..
చర్ల: తాలిపేరు ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతుండగా 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. దీంతో సోమవారం ప్రాజెక్టులోని 10 గేట్లను రెండడుగుల చొప్పున, 1 గేటును పూర్తిగా ఎత్తి 21,076 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74.00 మీటర్లు కాగా ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి నేపథ్యంలో నీటిమట్టాన్ని 73.23 మీటర్లు ఉంచి మిగిలిన నీటిని బయటకు వదులుతున్నారు. డీఈ తిరుపతి ప్రాజెక్టు వద్దే ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులు, సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.
11 గేట్లు ఎత్తి 21 వేల
క్యూసెక్కుల నీరు విడుదల