
కిన్నెరసానికి వరద పోటు
పాల్వంచరూరల్ : జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తింది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్‌లోకి 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో నీటిమట్టం సోమవారం 406.70 అడుగులకు పెరిగింది. దీంతో ఐదు గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు డ్యామ్‌సైడ్ పర్యవేక్షక ఇంజనీర్ తెలిపారు.
పర్యాటకులకు నిరాశే..
కిన్నెరసాని జలాశయం ప్రాజెక్టు గేట్లు ఎత్తితే చూడాలనే ఉత్సాహంతో పలువురు రాగా, గేటుకు తాళం వేయడంతో పర్యాటకులకు నిరాశే మిగిలింది. కాగా, ఆ సమయంలోనే పంజాబ్ రాష్ట్రంలోని బర్మాల్ నుంచి కొందరు చేరుకోగా, గేట్లు మూసి ఉండడం, బోటు షికారు కూడా నిలిపివేయడంతో నిరాశగా వెనుదిరిగారు. గేట్లు తెరిస్తే సెల్ఫీల కోసం పోటీ పడుతున్నారని, ఆ సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతోనే పర్యాటకులను లోనికి అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు.
ఐదు గేట్లు ఎత్తి 24 వేల
క్యూసెక్కుల నీరు విడుదల