ఉమ్మడి జిల్లా క్రీడా పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా క్రీడా పోటీలకు ఎంపిక

Oct 11 2025 6:30 AM | Updated on Oct 11 2025 6:30 AM

ఉమ్మడ

ఉమ్మడి జిల్లా క్రీడా పోటీలకు ఎంపిక

పాల్వంచరూరల్‌ : మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్‌సైట్‌ గిరిజన బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటి ఉమ్మడి జిల్లా పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ శ్యామ్‌కుమార్‌ తెలిపారు. పదో తరగతి చదువుతున్న మహేందర్‌ అండర్‌– 17 ఖోఖో, అండర్‌– 14 కబడ్డీ పోటీలకు కె.హర్షిత్‌, ఖోఖో పోటీలకు కె.దిక్షీత్‌ అర్హత సాధించారని వివరించారు. వీరిని ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.

ఖో–ఖో జిల్లా జట్టుకు ఎంపిక

ఇల్లెందు/ఇల్లెందురూరల్‌: మండలంలోని కొమరారం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని బూరుగడ్డ పవిత్ర జిల్లా జట్టుకు ఎంపికై ంది. గురువారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జిల్లాస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించగా, అండర్‌–14 విభాగంలో విద్యార్థిని ప్రతిభ చూపింది. త్వరలో భద్రాద్రి, ఖమ్మం జిల్లా జట్ల మధ్య జరిగే పోటీల్లో పాల్గొననుంది. పవిత్రను పాఠశాల హెచ్‌ఎం సుధాకర్‌, పీఈటీ రాంబాబు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు అభినందించారు.

నేడు ఉమ్మడి జిల్లా

ఖో–ఖో ఎంపిక పోటీలు

కల్లూరు: అండర్‌–19 బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికకు శనివారం కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పోటీలు నిర్వహించనున్నారు. అలాగే, చదరంగం జట్ల ఎంపిక పోటీలు ఆదివారం జరుగుతాయని జిల్లా పాఠశాల ల క్రీడల సంఘం కార్యదర్శి ఎండీ.మూసా ఖలీం తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్న బాలబాలికలు అర్హులని, ఆసక్తి ఉన్న వారు విద్యార్హతల సర్టిఫికెట్లు, మెమో, బోనఫైడ్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

డీఎంఎల్‌టీ సీట్ల భర్తీకి

దరఖాస్తులు ఆహ్వానం

చుంచుపల్లి: 2025–26 విద్యాసంవత్సరానికి కొత్తగూడెం వైద్య కళాశాలలో డీఎంఎల్‌టీ 30, డయాలసిస్‌ టెక్నీషియన్లు 30 సీట్ల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.హరిరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ బైపీసీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు వైద్య కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.

రూ. 22 వేలు

కాజేసిన హ్యాకర్‌

దుమ్ముగూడెం : మండలంలోని పెద్దనల్లబల్లి గ్రామానికి చెందిన మట్టా శేఖర్‌బాబు అకౌంట్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ మోసగాళ్లు రూ.22,400 తస్కరించారు. శుక్రవారం బాధితుడు వివరాలు వెల్లడించాడు. హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్‌ ఖాతా నుంచి నగదు రూ.22,400 డ్రా చేసినట్లు శేఖర్‌బాబు ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆయన బ్యాంకు అధికారులను సంప్రదించగా అకౌంట్‌ హ్యాక్‌ చేసి, నగదు డ్రా చేశారని తెలిపారు. దీంతో బాధితుడు హైదరాబాద్‌లోని సైబర్‌ క్రైం పోలీసులకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు.

ఆకతాయిల దాడిలో వ్యక్తికి గాయాలు

కొత్తగూడెంటౌన్‌: ఆకతాయిల దాడిలో ఓ వ్యక్తి గాయపడ్డ ఘటన శుక్రవారం టూటౌన్‌ ఏరియా పరిధిలోని రామవరంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రుద్రంపూర్‌లోని సెంటర్‌లో మద్యం తాగుతున్న యువకులను బొమ్మకంటి మధుకర్‌ అనే వ్యక్తి గతంలో మందలించాడు. చిన్నవయసులో మందు తాగొద్దని, మీ ఇంట్లో చెప్తానని హెచ్చరించాడు. ఆ విషయం మనసులో పెట్టుకుని అదే ప్రాంతానికి చెందిన రుద్రాక్ష్‌ (షానూ)అనే వ్యక్తి బీరు సీసాతో మధుకర్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో తలకు, చేతులకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రతాప్‌ తెలిపారు.

కోతుల దాడిలో వృద్ధుడికి తీవ్రగాయాలు

పాల్వంచరూరల్‌: ఇంటి మీదకు వచ్చాయని అదిలించబోగా కోతులు దాడి చేయడంతో వృద్ధుడికి తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం మండలంలోని నారాయణరావుపేట గ్రామానికి చెందిన వృద్ధుడు కొల్లు పెద్ద సుబ్బారెడ్డి ఇంటిమీద కోతులు వచ్చాయి. వాటిని కర్రతో తరిమే ప్రయత్నం చేయగా, అవి తిరిగి దాడి చేశాయి. దీంతో వృద్ధుడు కిందపడగా చేతులు, తలపై కరవడంతో స్పృహతప్పాడు. పక్క ఇంటివాళ్లు గమనించి వచ్చి కోతులను తరిమివేశారు. వృద్ధుడిని ఆటోలో పాల్వంచలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు.

ఉమ్మడి జిల్లా  క్రీడా పోటీలకు ఎంపిక1
1/2

ఉమ్మడి జిల్లా క్రీడా పోటీలకు ఎంపిక

ఉమ్మడి జిల్లా  క్రీడా పోటీలకు ఎంపిక2
2/2

ఉమ్మడి జిల్లా క్రీడా పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement