పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం

Oct 11 2025 5:58 AM | Updated on Oct 11 2025 5:58 AM

పెద్దమ్మతల్లికి  పంచామృతాభిషేకం

పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం

పాల్వంచరూరల్‌ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం పంచామృతాలతో వైభవంగా అభిషేకం చేశా రు. తొలుత అమ్మవారి జన్మస్థలంవద్ద పంచా మృతాలతో పాటు పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత నివేదన, పంచహారతి, నీరా జన మంత్రపుష్పం సమర్పించారు. కుంకమ పూజ, గణపతి హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్‌ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి

పోటీలకు ఎంపిక

అశ్వారావుపేటరూరల్‌: అశ్వారావుపేటకు చెందిన కేశిబోయిన భవ్య శ్రీలక్ష్మి రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీల్లో శ్రీలక్ష్మి అద్భుత ప్రతిభ కనబర్చింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఈ పోటీలకు హాజరు కాగా శ్రీలక్ష్మి ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. వచ్చేనెలలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలకు బాలిక హాజరు కానుంది. కాగా, శ్రీలక్ష్మి ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

175 మంది అధికారులకు పదోన్నతి

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న 175 మంది అధికారులకు కేడర్‌ స్కీమ్‌లో భాగంగా పదోన్నతులు కల్పిస్తూ కార్పొరేట్‌ కార్యాలయం ఈఈ సెల్‌ హెచ్‌ఓడీ ఏజే మురళీధర్‌రావు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో డిప్యూటీ మేనేజర్‌, అడిషినల్‌ మేనేజర్‌, సీనీయర్‌ అండర్‌ మేనేజర్‌, అండర్‌ మేనేజర్‌, సీనియర్‌ సర్వే ఆఫీసర్‌, సర్వే ఆఫీసర్‌, డీవైఎస్‌ఈ, ఈఈ, సీనియర్‌ ఎస్టేట్స్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఎస్టేట్స్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ స్థాయి అధికారులు ఉన్నారు.

డబ్లింగ్‌ లైన్‌ పనులు పరిశీలన

కారేపల్లి: కారేపల్లి రైల్వేస్టేషన్‌ మీదుగా నిర్మిస్తున్న డబ్లింగ్‌ లైన్‌ పనులను దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణ శుక్రవారం పరి శీలించారు. డోర్నకల్‌ రైల్వే జంక్షన్‌నుంచి కారేపల్లి మీదుగా కొత్తగూడెం(భద్రాచలం రోడ్డు) వరకు నిర్మించే లైన్‌ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. కాగా, లైన్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారు పరిహారం చెల్లించాలని కోరగా డీఆర్‌ఎం సానుకూలంగా స్పందించారు. అనంతరం కారేపల్లి గ్రామస్తులు డీఆర్‌ఎంను కలిసి కరోనా సమయాన రద్దు చేసిన డోర్నకల్‌–భద్రాచలం రోడ్‌, మణుగూరు–కాజీపేట జంక్షన్‌ ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. అంతేకాక డోర్నకల్‌ నుంచి కొత్తగూడెం వరకు వెళ్లే అన్ని రైళ్లకు కారేపల్లిలో హాల్టింగ్‌ కల్పించాలని వినతిపత్రం ఇచ్చారు. గ్రామస్తులు సురేందర్‌రెడ్డి, సురేందర్‌ మణియార్‌, తురక నారాయణ, అజ్మీర బిచ్చ్యానాయక్‌, తొగర శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement