
అనుమతులు లేని ఇసుక సీజ్
అశ్వాపురం: మండలంలోని చింతిరాల క్రాస్‌రోడ్డు సమీపంలో ఎలాంటి అనుమతులు లేని ఇసుక డంపును తహసీల్దార్ మణిధర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆర్‌ఐ లీలావతి సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఆవులు తరలిస్తున్న వాహనం పట్టివేత
అశ్వారావుపేటరూరల్: అనుమతులు లేకుండా అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఆర్‌టీఏ చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఏపీలోని తుని వారపు సంత నుంచి అనుమతులు లేకాండా అశోక్ లేల్యాండ్ వాహనంలో 46 ఆవులను హైదరాబాద్‌లోని తుక్కుగూడ వద్ద కబేళాకు తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. అనంతరం ఆవులను తరలిస్తున్న వ్యక్తితోపాటు వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసి, ఆవులను పాల్వంచలోని గోశాలకు తరలించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
ఓబీ కంపెనీ ప్రతినిధికి దేహశుద్ధి..!
మణుగూరుటౌన్: ఏరియాలోని ఎంఎన్‌జీఓసీలో ఓబీ పనులు దక్కించుకున్న ఓ కంపెనీ వ్యవహారాలు చూసుకునే ప్రతినిధికి దేహశుద్ధి జరిగిన ఘటన మణుగూరులో మంగళవారం చోటుచేసుకుంది. ఓబీ కంపెనీలో పనులు నిర్వహించే ఓ మహిళ పట్ల సదరు వ్యక్తి కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వేధింపులు తాళలేక మహిళ వారి కుటుంబ సభ్యులకు తెలపగా, వారు కంపెనీ ప్రతినిధికి దేహశుద్ధి చేశారు. ఈ విషయమై సింగరేణి అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్ని ంచగా, తమ దృష్టికి రాలేదని తెలిపారు.