
కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబురాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో రెవెన్యూ, సివిల్ సప్లై శాఖల ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ హాజరై మాట్లాడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ విద్యాచందన, తహసీల్దార్లు గన్యా, భగవాన్‌రెడ్డి, స్వర్ణలత, స్వాతిబిందు పాల్గొన్నారు.
సింగరేణి ప్రధాన కార్యాలయంలో..
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ప్రధాన కార్యాలయంలో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం అధికారులు ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి బహమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు జీవీ కిరణ్ కుమార్, కే.విజయలక్ష్మి వెంకటేశ్వర్లు, టి.సంధ్యారాణి,పి.సుమలత, కేసా నారాయణ రావు, బి.శివకేశవరావు, ముకుంద సత్యనారాయణ, నాయకులు ఎం.శ్యామ్ కిరణ్, ఎస్.పితాంబర రావు, ఆర్.కేశవ రావు, కే.జానకి సాయిబాబు, జి.నాగబిందు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబురాలు