
పత్తి పంట ధ్వంసం
టేకులపల్లి/గుండాల: ఆళ్లపల్లి మండలం రాయిపాడు గ్రామానికి చెందిన రైతులు ఊకే నాగేశ్వర్‌రావు –చంద్రకళ దంపతులు టేకులపల్లి మండలం మురళీపాడు బీట్‌లో ఎకరం భూమిలో పత్తి సాగు చేస్తున్నారు. నెలరోజుల్లో పంట చేతికి వచ్చే దశకు చేరింది.బుధవారం అర్ధరాత్రి అటవీశాఖ అధికారులు పత్తి పంటను ధ్వంసం చేశారు. గురువా రం ధ్వంసమైన పంటను చూసి రైతు కుటుంబం బోరున విలపించింది.
ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులు
ఆళ్లపల్లి మండలంలో పర్యటిస్తున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును రైతులు అడ్డుకున్నారు. న్యాయం చేయాలని బైఠాయించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పంట ధ్వంసం విషయమై వివరణ కోసం ఫారెస్టు రేంజర్‌కు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.
న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు వేడుకోలు

పత్తి పంట ధ్వంసం