
బెటాలియన్‌ను సందర్శించిన అదనపు డీజీపీ
చుంచుపల్లి: చాతకొండ 6వ బెటాలియన్‌ను టీజీఎస్‌పీ బీఎన్ అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్, కలెక్టర్ జితీష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా బెటాలియన్‌లో చేపట్టిన డైనింగ్ హాల్, జిమ్ రూమ్, పార్కింగ్ షెడ్, బుద్ధ విగ్రహం, ఓపెన్ జిమ్, క్రీడా మైదానం, ఎస్‌డీఆర్‌ఎఫ్ ఆఫీస్ రూమ్, అకమిడేషన్ హాళ్లను ప్రారంభించారు. అనంతరం బెటాలియన్ సిబ్బందితో వసతుల కల్పనపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్ రెడ్డి, అదనపు కమాండెంట్ బి.వెంకటేశ్వర రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్‌లు జి.వి కిరణ్‌కుమార్, సింగరేణి వెల్ఫేర్ జీఎం బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.