
గర్భిణులు రక్తపరీక్షలు చేయించుకోవాలి
చుంచుపల్లి: గర్భిణులు హిమోగ్లోబిన్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి సూచించారు. తమ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పీహెచ్‌సీ స్థాయిలోనే ప్రసవాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, గర్భిణుల ఏఎన్‌సీ నమోదు 100 శాతం సాధించాలని అన్నారు. ప్రాథమిక స్థాయిలో ఆరోగ్య సేవల మెరుగుదల కోసం నిబద్ధతతో పనిచేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. కాగా, సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ తొలుత పలు సూచనలు చేశారు. డాక్టర్లు మధువరణ్, స్పందన, తేజస్వి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.