పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

Sep 25 2025 7:13 AM | Updated on Sep 25 2025 7:13 AM

పనుల్లో నాణ్యతా  ప్రమాణాలు పాటించాలి

పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

పినపాక: వివిధ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యంగా ఉండాలని, నిరంతరం అధికారులు పర్యవేక్షించాలని ట్రెయినీ కలెక్టర్‌ సౌరభ్‌శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. వంట చెరకు, మరుగుదొడ్లు, విద్యార్థుల గదులను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, అనుకున్న సమయానికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్‌ ఎస్కే సైదులు, డీఈ నాగేశ్వరచారి, ఏఈ సత్యశ్రీనివాస్‌, ఎంఈఓ నాగయ్య పాల్గొన్నారు.

కోర్టుకు హాజరుకాని ఇద్దరు అరెస్ట్‌

సుజాతనగర్‌: కోర్టు వాయిదాలకు హాజరుకాని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించిన ఘటన స్థానిక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఎం.రమాదేవి కథనం మేరకు.. మండలంలోని సీతంపేటబంజర గ్రామానికి చెందిన బాదావత్‌ మాన్య, కోమటిపల్లి గ్రామానికి చెందిన భూక్యా సురేశ్‌పై గతంలో కేసు నమోదైంది. అయితే వీరిద్దరూ వాయిదాల నిమిత్తం కోర్టుకు హాజరుకావడం లేదు. దీంతో కొత్తగూడెం సెకండ్‌ అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌పై ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి సబ్‌ జైలుకు తరలించామని తెలిపారు.

‘గంజాయి’ నిందితుల ఆస్తుల జప్తు

పినపాక: నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నిందితుల ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ఈ–బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. 2024 జూన్‌ 29న ఏడూళ్ల బయ్యారం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితులపై ఫైనాన్షియల్‌ ఇన్వెస్టిగేషన్‌ నిర్వహించగా, వారి పేర్లపై ఉన్న ఒక ట్రాక్టర్‌, ఒక కారు, ఒక ఆటో, నాలుగు మోటార్‌ సైకిళ్లు, మూడు గృహాలను ఫ్రీజ్‌ చేయించామన్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.23.52లక్షలుఅనిపేర్కొన్నా రు. గంజాయి అక్రమరవాణా ద్వారాసంపాదించి న డబ్బుతో నిందితులు, వారి బంధువుల పేర్లపై కొనుగోలు చేసిన ఆస్తులను కూడా జప్తు చేశామని సీఐ వివరించారు. కాగా, సీఐ వెంకటేశ్వరరావు, సిబ్బందిని ఎస్పీ రోహిత్రాజు అభినందించారు.

నాటుసారా స్వాధీనం

బూర్గంపాడు: మండలంలో బుధవారం ఎక్సైజ్‌శాఖ అధికారులు, సిబ్బంది జరిపిన దాడుల్లో 7 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పినపాక పట్టీనగర్‌, అంజనాపురం, మోరంపల్లిబంజర, నాగినేనిప్రోలు, సారపాకల్లో నిర్వహించిన దాడుల్లో నాటుసారా విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశామని వారిపై కేసు నమోదు చేశామని ఎకై ్సజ్‌ ఎస్‌ఐ గౌతమ్‌ తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్‌ సిబ్బంది రామకృష్ణ, సుమన్‌, హబీబ్‌పాషా, గురవయ్య, రమేశ్‌, శ్రావణి పాల్గొన్నారు.

ఫ్యామిలీడే ఘనంగా నిర్వహించాలి

ఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలో ఫ్యామిలీడే, బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సేవా సమితి అధ్యక్షురాలు ఈసం రమ కోరారు. బుధవారం ఇల్లెందులోని సింగరేణి హైస్కూల్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 29న ఫ్యామిలీ డే వేడుకలు, సద్దుల బదుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ సుధాకర్‌, అజయ్‌, సులక్షణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement