
‘సారథి’ సతాయిస్తోంది..
సత్తుపల్లిటౌన్: రవాణా శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన యాప్ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తోంది. టీజీట్రాన్స్‌పోర్ట్ స్థానంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సారథి యాప్ సతాయిస్తోంది.
కొత్త లైసెన్సు కోసం లెర్సింగ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెస్సు, లైసెన్సు రెన్యూవల్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. గతంలో స్లాట్ బుక్ చేస్తే ఒకే ఓటీపీ వచ్చేది. ఇప్పుడు ఐదు నుంచి ఏడు ఓటీపీలు వస్తుండటంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. రెండు నిమిషాల్లో అయిపోయే ఈ ప్రక్రియ కోసం గంటల తరబడి కార్యాలయంలో పడిగాపులు పడాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఈ విషయమై రవాణాశాఖ అధికారి జేఎన్ శ్రీనివాసరావును వివరణ కోరగా యాప్ నూతనంగా ప్రవేశపెట్టారని, సమస్యనుఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.