
మృత్యువులోనూ వీడని స్నేహం
నేలకొండపల్లి: ఎక్కడకు వెళ్లినా కలిసిమెలిసి తిరిగే ఇద్దరు స్నేహితులకు మృత్యువు కూడా విడదీయలేకపోయింది. చీకటి, వర్షం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుండగా.. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రగాయాలతో మృత్యువాత పడ్డారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంకు చెందిన డిగ్రీ విద్యార్థి బచ్చలకూరి మనోజ్‌కుమార్(18), మెకానిక్ సన్నీ ప్రసాద్(17) ఇద్దరు స్నేహితులు. వీరు మంగళవారం రాత్రి బైక్‌పై నేలకొండపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఇటుక బట్టీల సమీపాన ఎదురుగా మరో బైక్ వస్తుండడంతో ఎదురెదురుగా ఢీకొన్నా యి. దీంతో మనోజ్, ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ససరికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, జోరు వాన, చీకటిగా ఉండడంతో ఎదురుగా బైక్‌పై వస్తున్న వారికి కనిపించక ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, మృతులిద్దరూ ఒకే గ్రామస్తులు, స్నేహితులు కావడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి