
వైఎస్సార్ నగర్‌లో దొంగల హల్‌చల్
ఖమ్మం అర్బన్: ఖమ్మం 8వ డివిజన్ వైఎస్సార్ నగర్‌లో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. ముసుగులు ధరించి వచ్చిన ఎనిమిది మంది ముఠా కాలనీలోని ఆరు ఇళ్లలో చోరీకి పాల్ప డ్డారు. స్థానికులు వసంతబాయి, రుక్మిణి లేకపోవడంతో వారి ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్టు సమాచారం. దొంగల కదలికలు సీసీ కెమెరాల్లో కూడా రికార్డు అయ్యాయి. అంతేకాక ఒక బెల్ట్ షాప్‌లో జొరబడి నగదు చోరీ చేయడంతో పాటు మద్యం తాగినట్లు సమాచారం. ఈక్రమాన ఒక మహిళ అడ్డుకునే ప్రయత్నం చేస్తే సెల్‌ఫోన్ లాక్కు ని, మరో ఇద్దరిపై దాడి చేసినట్లు తెలిసింది. ఈ విషయమై అందిన సమాచారంతో మంగళవారం ఉదయం ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్, సిబ్బందితో చేరుకుని విచారణ చేపట్టారు. అయితే, చోరీల వెనుక స్థానిక యువకులే ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే మాదిరి గత నెలలోనూ మధురనగర్ ప్రాంతంలో ముసుగులు ధరించిన వ్యక్తులు చోరీ చేశారు. ఈమేరకు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఎనిమిది మంది ముఠా.. ఆరు ఇళ్లలో చోరీ