
కిన్నెరసాని నాలుగు గేట్లు ఎత్తివేత
గోదావరిలోకి 20 వేల క్యూసెక్కుల
నీరు విడుదల
పాల్వంచరూరల్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థం గల ఈ రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 12 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో నీటిమట్టం మంగళవారం 405.70 అడుగులకు పెరిగింది. దీంతో రాత్రి సమయంలో నాలుగు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు డ్యామ్‌సైడ్ పర్యవేక్షక ఇంజనీర్ తెలిపారు.