
బీటీపీఎస్‌లో అక్రమాలపై విచారణ చేపట్టాలి
మణుగూరు రూరల్: బీటీపీఎస్ సీఈపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని జాతీయ ఆదివాసీ అఖిలపక్ష ప్రజాసంఘాల అధ్యక్షులు చందా లింగయ్యదొర జెన్‌కో యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సాంబాయిగూడెం గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. బీటీపీఎస్ నిర్మాణంలో 641మంది ఆదివాసీలు భూములు కోల్పోతే, 73మందికే పరిహారం, ఉపాధి కల్పించారని అన్నారు. 357 మంది భూములు లేని గిరిజనేతరులకు ప్యాకేజీతోపాటు ఉద్యోగం కల్పించారని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న సీఈపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు గొగ్గల రామకృష్ణ దొర, కొమరం శ్రీను, కుంజా వెంకటరమణ, చిడెం నాగేశ్వరరావు, మడి గౌతమి, గోపాల్, కుంజా ఆది లక్ష్మి, పి.విజయలక్ష్మి, మంగమ్మ, రజిని పాల్గొన్నారు.