
ఆయిల్‌పామ్ గెలల తిరస్కరణపై నిరసన
దమ్మపేట: మండలంలోని అప్పారావుపేట ఫ్యాక్టరీలో ఆయిల్‌పామ్ గెలల తిరస్కరణ పేరుతో ఒక్కో ట్రాక్టర్‌కు 50 కేజీల వరకు తగ్గించి, కాంటా రశీదును ఇస్తున్నారని గొర్రెగుట్ట గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డి రమణమూర్తి ఆరో పించారు. సోమవారం ఆయన ఫ్యాక్టరీ వద్ద నిరసన తెలిపారు. పలుకుబడి ఉన్న రైతులకు ఎలాంటి తిరస్కరణ లేదని, కేవలం సామాన్య రైతుల గెలలనే అధికారులు తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. తిరస్కరించిన గెలలను రైతులకు వెనక్కి ఇవ్వడం లేదన్నారు. దీనిపై ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్‌ను వివరణ కోరగా.. పచ్చి, పుచ్చు, పనికిరాని గెలలను పరిశీలించాకే సిబ్బంది కాంటాలో తగ్గించి రాస్తారని తెలిపారు.