
రామయ్య సేవలో సంగీత దర్శకుడు
భద్రాచలంటౌన్: భద్రాచలం సీతారామచంద్రస్వామివారిని దేవస్థానాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు బోలె షావలీ సోమవారం సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు బుడగం శ్రీనివాస్, సరెళ్ల నరేష్, కోటేష్, సత్యలింగం, వెంకటేష్, సుధాకర్, శ్రీనివాస్, నటరాజ్, గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి
పీఓడ్లబ్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ
ఇల్లెందు: వచ్చే నెల 11,12 తేదీల్లో నల్లగొండ జిల్లా బొట్టుగూడలో నిర్వహించే పీఓడబ్ల్యూ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని పీఓడ్లబ్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ కోరారు. సోమవారం ఇల్లెందు ఎన్డీ కార్యాలయంలో జరిగిన జిల్లా సమావేశంలో ఆమె మాట్లాడారు. సనాతన ధర్మం పేరుతో మత చాందసవాదం మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. పసి పిల్లలపై అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం అమ్మకపోతే సంక్షేమ అమలు చేయలేమని ప్రభుత్వాలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాయని విమర్శించారు. 30 నుంచి 35 ఏళ్ల వయసులోనే ఎంతో మంది మహిళలు వితంతువులుగా మారడానికి, కుటుంబ కలహాలకు మద్యమే కారణమ ని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు ఆదిలక్ష్మి, కల్తీ సుభద్ర, మోకాళ్ల సుగుణ, సరోజిని, భూలక్ష్మి, రాపర్తి లక్ష్మి, మంగ, సమ్మక్క పాల్గొన్నారు.
ప్రశాంతంగా
‘ఓపెన్’ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: మొదటి రోజు సోమవారం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి నాగలక్ష్మి తెలిపారు. ఇంటర్‌లో 39 మంది అభ్యర్థులకు గానూ 24 మంది హాజరు కాగా, 15 మంది గైర్హాజరయ్యారు. పదో తరగతిలో 36 మంది అభ్యర్థులకు గానూ 26 మంది హాజరయ్యారు. 10 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం థియరీ పరీక్షకు 59 మంది విద్యార్థులకు గానూ 48 మంది హాజరయ్యారు. 11 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ రెండు సెంటర్లను సందర్శించారు.
కొనసాగుతున్న
కిన్నెరసాని నీటి విడుదల
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లోకి 10 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో సోమవారం నీటిమట్టం 406.50 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్ట్ మూడు గేట్లు రాత్రి సమయంలో ఎత్తివేసి 15 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.
యూరియా సరఫరాను మెరుగుపరుస్తాం
జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు
బూర్గంపాడు: యూరియా సరఫరాను మెరుగుపరిచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు అన్నారు. బూర్గంపాడులోని పీఏసీఎస్ గోదాం వద్ద జరుగుతున్న యూరియా విక్రయాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు వానాకాలం పంటలకు యూరియా సరఫరాలో కొన్ని ఇబ్బందులు కలిగాయని, వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. యూరియా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విక్రయాల వద్ద పోలీస్ బందో బస్తును ఏర్పాటు కోరుతున్నామని తెలిపారు. ఏఓ శంకర్, సొసైటీ సీఈఓ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రామయ్య సేవలో సంగీత దర్శకుడు

రామయ్య సేవలో సంగీత దర్శకుడు