
పాడె మోసిన ఎమ్మెల్యే జారె
అశ్వారావుపేటరూరల్: మండలంలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జుజ్జురు వెంకటనారాయణ(55) సోమవారం గుండెపోటుతో మృతిచెందాడు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. వెంకట నారాయణ పాడె మోసి అంతిమ వీడ్కోలు పలికారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నివాళులర్పించినవారిలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.
క్షతగాత్రురాలిని కారులో ఆస్పత్రికి
తరలించిన ఎమ్మెల్యే
చండ్రుగొండ: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆది నారాయణ సోమవారం అన్నపురెడ్డిపల్లి మండలం నుంచి చండ్రుగొండ వైపు వస్తున్నారు. అదే సమయంలో సీతాయిగూడెం వద్ద దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఏపీ రాష్ట్రం కుక్కునూరుకు చెందిన పూనం ఓసమ్మ, భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వస్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో ఆమె తీవ్రగాయాలు కాగా, ఎమ్మెల్యే జారె బాధితురాలిని తన కారులో చండ్రుగొండ పీహెచ్‌సీ తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పాడె మోసిన ఎమ్మెల్యే జారె