
ఎస్పీ అభినందనలు
కొత్తగూడెంటౌన్: అశ్వారావుపేట, మణుగూరు, కొత్తగూడెం త్రీటౌన్ పోలీసు స్టేషన్ల పరిధిలో మర్డర్ కేసుల్లో నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లను ఎస్పీ రోహిత్‌రాజు అభినందించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పీవీడీ లక్ష్మి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లావణ్య, విశ్వశాంతి, రాజారావు, కోర్టు డ్యూటీ అధికారులు అశోక్, హేమీలాల్, నాగేశ్వరావు, మోహన్, శోభన్‌లను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో కూడా కేసుల పరిష్కారానికి కృషి చేయచడం అభినందనీయమని పేర్కొన్నారు. కొత్తగూడెం డీఏస్పీ అబ్దుల్ రెహమాన్, త్రీటౌన్ సీఐ శివప్రసాద్, ఎస్‌ఐ రాఘవ పాల్గొన్నారు.
ఆన్‌లైన్ స్కీం
మోసాలపై ఫిర్యాదు
ఇల్లెందు: ఇల్లెందులో ఓ ఆన్‌లైన్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో పెద్ద సంఖ్యలో బాధితులు రోడ్డున పడ్డారు. ఈ మేరకు పరదేవీ బస్తీకి చెందిన కిరణ్ పాసీ, కళ్యాణ్ పాసీ, బాలప్రసాద్ పాసీ, లక్ష్మీనారాయణలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణానికి చెందిన శంకర్, బిస్వాస్‌తోపాటు మరికొందరు ఆన్‌లైన్ స్కీం ప్రతినిధులు ఆన్‌లైన్ కంపెనీలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటూ మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురి నుంచి రూ.17,500 వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. కంపెనీ ప్రతినిధులుగా చెలామణి అయిన వారి అకౌంట్లు సీజ్ చేసి, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.